||సుందరకాండ ||

||నలభైరెండవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 42 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ద్విచత్వారింశస్సర్గః

తతః పక్షి నినాదేన వృక్షభంగస్వనేన చ|
బభూవు స్త్రాససంభ్రాంతాః సర్వే లంకానివాసినః||1||

స|| తతః సర్వే లంకావాసినః పక్షి నినాదేణ వృక్షభంగస్వనేన చ త్రాస సంభ్రాంతాః బభూవుః||

అప్పుడు లంకావాసులు అందరూ పక్షుల నినాదములతోనూ చెట్లు పడగొట్టబడుతున్న ధ్వనులతోనూ భయపడి భ్రాంతులు అయ్యారు.

విద్రుతాశ్చ భయత్రస్తా వినేదుర్మృగపక్షిణః|
రక్షసాం చ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే||2||
తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననః|
తద్వనం దదృశుర్భగ్నం తం చ వీరం మహాకపిమ్||3||
స తా దృష్ట్వా మహాబాహుః మహాసత్త్వో మహాబలః|
చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహమ్||4||

స|| మృగపక్షిణః విద్రుతాః భయత్రాసాః వినేదుః | రక్షసాం చ క్రూరాణి నిమిత్తాని ప్రతిపేదిరే||తతః వికృతాననః రక్షస్యః నిద్రాయాం గతాయాం తత్ భగ్నం వనం వీరం మహాకపిం చ దద్రుశుః ||మహాబలః మహాసత్త్వః సః తాః దృష్ట్వా రాక్షసీనాం భయావహం సుమహత్ రూపం చకార||

మృగములు పక్షులు భయముతో శబ్దము చేసినవి. రాక్షసులు క్రూరమైన శకునములు చూసిరి. వికృతమైన ముఖములు కల రాక్షసులు నిద్రనుంచి మేలుకొని భగ్నమైన వనమును వీరుడగు మహాకపిని చూచిరి. మహాబలము మహాసత్త్వము గల ఆ వానరుడు ఆ భయపడిన రక్షసులను చూచి మహత్తరమైన రూపమును ధరించెను.

తతస్తం గిరి సంకాశం అతికాయం మహాబలమ్|
రాక్షస్యో వానరం దృష్ట్వా ప్రపచ్ఛుర్జనకాత్మజమ్||5||
కోsయం కస్య కుతో వాయం కిన్నిమిత్తమిహాగతః|
కథం త్వయా సహానేన సంవాదః కృత ఇత్యుత ||6||
ఆచక్ష్వ నో విశాలాక్షి మాభూత్తే సుభగే భయమ్|
సంవాద మసితాపాంగే త్వయా కిం కృతవానయమ్||7||

స|| తతః తం గిరిసంకాశం అతికాయం మహాబలం వానరం దృష్ట్వా రాక్షస్యః జనకాత్మజం ప్రపచ్ఛుః||అయం కః| కస్య అయం| కుతః కిం నిమిత్తం ఇహ ఆగతః| త్వయా సః అనేన సంవాదః కృతః కథం ఇతి|| విశాలాక్షి నః ఆచక్ష్వ| సుభగే తే భయం మాభూత్ | అసితాపాంగే అయం త్వయా కిం సంవాదం కృతవాన్ ||

అప్పుడు పర్వతాకారముతో సమానమైన కాయముగల మహాకాయుని మహాబలుడు అగు వానరుని చూచి ఆ రాక్షసులు జనకాత్మజ ని అడిగిరి. ' ఇతడు ఎవరు? ఎవరి వాడు?ఎక్కడినుంచి ఎందుకు ఇక్కడికి వచ్చినవాడు? నీతో అతడు ఏమి మాట్లాడినాడు? ఓ విశాలాక్షీ మాతో చెప్పుము. ఓ సౌభాగ్యవంతురాలా భయము వలదు. ఓ అసితేక్షణా అతడు నీతో ఏమి మాట్లాడెను?'

అథాబ్రవీన్ మహాసాధ్వీ సీతా సర్వాంగసుందరీ|
రక్షసాం భీమరూపాణాం విజ్ఞానే మమ కా గతిః||8||
యూయమేవాభిజానీత యోఽయం యద్వా కరిష్యతి|
అ హి రేవ హ్యహేః పాదాన్ విజానాతి న సంశయః||9||
అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వయమ్|
వేద్మి రాక్షస మేవైన కామరూపిణ మాగతమ్||10||

స|| సీతా మహాసాధ్వీ సర్వాంగసుందరీ అబ్రవీన్ | భీమరూపాణాం రక్షసాం విజ్ఞానే గతిః మమ కా||యూయం ఏవ అభిజానీతా అయం యః యద్వా కరిష్యతి | అహేః పాదాన్ అహిః ఏవ విజానాతి | సంశయః న ||అహం అపి అస్య భీతా అస్మి| ఏనం కో ను అయం న జానామి | ఏనం ఆగతం కామరూపిణం రాక్షసం ఏవ వేద్మి||

సర్వాంగసుందరీ మహాసాధ్వి అయిన సీత ఇట్లు పలికెను. భీమరూపులైన రాక్షసుల గతి గురించి నాకు ఎలా తెలుయును? మీకే తెలిసిఉండాలి ఇతడు ఎవరో ఎందుకువచ్చాడో ఏమి చేయగోరుచున్నాడో? పాముయొక్క గుర్తులు పాములకే తెలియును కదా. అందులో సందేహము లేదు. నేను కూడా భయములో ఉన్నాను. ఇతడెవరో నాకు తెలియదు. ఇలావచ్చిన ఇతడు కామరూపులు అగు రాక్షసులవాడే అని అనుకొంటాను.'

వైదేహ్యా వచనం శ్రుత్వా రాక్ష్యస్యో విద్రుతా దిశః|
స్థితః కాశ్చిద్గతాః కాశ్చిత్ రావణాయ నివేదితుమ్||11||
రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాననాః|
విరూపం వానరం భీమ మాఖ్యాతు ముపచక్రముః||12||

స|| వైదేహ్యాః వచనం శ్రుత్వా కాశ్చిత్ రాక్షస్యః దిశః విద్రుతాః | కాశ్చిత్ స్థితః | కాశ్చిత్ రావణాయ నివేదితుం గతాః|| వికృతాననః రాక్షస్యః రావణస్య సమీపే విరూపం భీమం వానరం ఆఖ్యాతుం ఉపవక్రముః|

వైదేహి వచహనములను విని రాక్షసులు అన్ని దిశలలో పోయిరి. కొందరు అక్కడే ఉండిపోయిరి. కొందరు రావణునికి చెప్పుటకు వెళ్ళిరి. వికృతాననము గల రాక్షసులు రావణుని వద్దకు పోయి భయంకరరూపము గల వానరుని గురించి చెప్పుటకు ఉపక్రమించిరి.

అశోకవనికామధ్యే రాజన్ భీమవపుః కపిః|
సీతయా కృతసంవాదః తిష్ఠత్యమిత విక్రమః||13||
న చ తం జానకీ సీతా హరిం హరిణలోచనా|
అస్మాభిర్బహుధా పృష్ఠా నివేదయితుమిచ్ఛతి||14||
వాసవస్య భవేద్దూతో దూతో వైశ్రవణస్య వా|
ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణకాంక్షయా||15||

స|| రాజన్ అమిత విక్రమః భీమః కపిః సీతాయా కృతసంవాదః అశోకవనికా మధ్యే తిష్టతి||సీతా హరిణలోచనా జానకీ అస్మాభిః బహుధా పృష్ఠా తం నివేదయితుం న ఇచ్ఛతి || వాసవస్య దూతో భవేత్ | వా వైశ్రవణస్య దూతః | సీతాన్వేషణ కాంక్షయా రామేణ ప్రేషితః అపి వా భవేత్ ||

'ఓ రాజన్ అమితమైన విక్రమము గల భయము కలిగించు వానరుడు సీతతో మాట్లాడి అశొకవనిక మధ్యలో ఉన్నాడు. లేడి కళ్ళవంటి కళ్ళు గల జానకి మాచేత అనేకవిధములుగా అడగబడినప్పటికీ వానిగురించి చెప్పుట లేదు. అతడు ఇంద్రుడి దూతయో కుబేరుని దూతయో సీతాన్వేషణగురించి రామునిచేత పంపబడిన వాడో కావచ్చు'.

తేన త్వద్భుతరూపేణ యత్తత్తవ మనోహరమ్|
నానామృగగణాకీర్ణమ్ ప్రమృష్టం ప్రమదావనమ్||16||
న తత్ర కశ్చిదుద్దేశో యస్తేన న వినాశితః|
యత్రా సా జానకీ సీతా స తేన న వినాశితః||17||
జానకీరక్షణార్థం వా శ్రమాద్వా నోపలభ్యతే|
అథావా కః శ్రమస్తస్యసైవ తే నాభిరక్షితా||18||
చారుపల్లవపుష్పాఢ్యం యం సీతా స్వయమాస్థితా|
ప్రవ్రద్ధః శింశుపావృక్షః స చ తేనాభిరక్షితః||19||

స|| అద్భుతరూపేణ తేన మనోహరం నానామృగాకీర్ణం యత్ తవ ప్రమదావనం ప్రమృష్టం ||తేన యః న వినాశితః ఉద్దేశః తత్ర కశ్చిత్ న | యత్ర సా జానకీ (స్థితః) సః తేన నవినాశితః|| జానకీ రక్షణార్థం వా శ్రమాత్ వా న ఉపలభ్యతే| అథవా కః తేన స ఏవ అభిరక్షితా || సీతా చారుపల్లవపుష్పాఢ్యం యం స్వయం ఆస్థితా సః ప్రవృద్ధః శింశుపావృక్షః తేన అభిరక్షితః ||

' ఆద్భుతరూపము గలవానిచేత మనోహరమైన అనేక మృగములతో కూడి వున్న ఆ ప్రమదావనము నాశనము అయినది. అతనిచేత నాశనము చేయబడని స్థలము లేదు. ఎక్కడ జానకి ఉన్నదో అక్కడ మాత్రము ధ్వంసము చేయలేదు. జానకీ దేవి రక్షణకోసమో లేక శ్రమవలనో వదిలేసెనో మాకు తెలియదు. వానిచేత ఎందుకు అది రక్షింపబడెనో తెలియదు. సీత స్వయముగా కూర్చుని ఉన్న అందమైన చిగుళ్ళు కల శింశుపావృక్షము అతనిచేత రక్షింపబడినది'.

తస్యోగ్రరూపస్యోగ్ర త్వం దండమాజ్ఞాతు మర్హసి|
సీతా సంభాషితా యేన తద్వనం చ వినాశితమ్||20||
మనః పరిగృహీతాం తాం తవ రక్షోగణేశ్వర|
కః సీతామభిభాషేత యో న స్యాత్త్యక్తజీవితః||21||
రాక్షసీనాం వచః శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః|
హుతాగ్ని రివ జజ్వాల కోపసంవర్తితేక్షణః||22||

స|| యేన సీతా సంభాషితా తత్ వనం చ వినాశితం | తస్య ఉగ్రరూపస్య త్వం ఉగ్రం దణ్డం ఆజ్ఞాతుం అర్హసి || రక్షో గణేశ్వర మనః పరిగ్రహీతాం తాం సీతాం యః త్యక్తజీవితః నస్యాత్ అభిభాషేత ?|| రాక్షసీనాం వచః శ్రుత్వా రాక్షసేశ్వరః రావణః కోప సంవర్తిత ఈక్షణః హుతాగ్నిః ఇవ జజ్వాల||

"ఎవనితో సీత సంభాషణ చేసెనో అతడు ఆ వనమును ధ్వంశము చేసెను. ఆ ఉగ్రరూపముగల వానిని నువ్వు ఉగ్రమైన దండము విధించ తగును. తన జీవితముపై ఆశవదిలినవాడు తప్ప ఎవడు రాక్షసాధిపును మనస్సును బందించిన ఆ సీతతో మాట్లాడగలడు?' రాక్షసుల వచనములను విన్నకోపము గల రాక్షసాధిపతి కళ్ళుతో ఉరుముతూ కోపము గలవాడై హుతాగ్ని వలె మండి పడెను.

తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాస్రబిందవః|
దీప్తాభ్యామివ దీపాభ్యాం సార్చిషః స్నేహబిందవః||23||
ఆత్మనసదృశాన్ శూరాన్ కింకరాన్నామ రాక్షసాన్ |
వ్యాదిదేశ మహాతేజా నిగ్రహార్థం హనూమతః||24||

స|| తస్య కృద్ధస్య నేత్రాభ్యాం దీప్తాభ్యాం దీపాభ్యాం సార్చిషః స్నేహబిందవః ఇవ అస్రబిందవః ప్రాపతన్ ||మహాతేజా హనూమతః నిగ్రహార్థం అత్మనః సదృశాన్ శురాన్ కింకరాన్ నామ రాక్షసాన్ వ్యాదిదేశ ||

ఆ కోపము గలవాని కళ్ళనుండి ప్రజ్వరిల్లు తున్న దీపములనుండి మంటతో కూడిన తైలబిందువులు రాలినట్లు అశ్రుకణములు రాలెను. ఆ మహాతేజోవంతుడైన హనుమంతుని నిగ్రహించుటకు తనతో సమానమైన కింకరులు అను పేరుగల రాక్షసులకు అదేశము మిచ్చెను..

తేషా మశీతి సాహస్రం కింకరాణాం తరస్వినామ్|
నిర్యయుర్భవనాత్ తస్మాత్ కూటముద్గరపాణయః||25||
మహోదరా మహాదంష్ట్రా ఘోరరూపా మహాబలాః|
యుద్ధాభిమనసః సర్వే హనుమద్గ్రహణోన్ముఖాః||26||

స|| తరస్వినాం తేషాం కింకరాణాం అసీతిసహస్రం మహోదరాః మహాదంష్ట్రాః ఘోరరూపాఃమహాబలాః యుద్ధాభిమనసః సర్వే కూటముద్గరపాణయః హనుమద్గ్రహణోద్యతాః తస్మాత్ భవనాత్ నిర్యయుః||

మహత్తరమైన ఉదరము, మహత్తరమైన పళ్ళు గల ఘోరరూపము గల భయకరరూపముగల ఎనభైవేల కింకరుల సముదాయము , యుద్ధము చేయుటకు మనస్సు గలదై హనుమంతుని బంధించుటకు ఆ భవనము నుండి వెడలెను.

తే కపీంద్రం సమాసాద్య తోరణస్థమవస్థితమ్|
అభిపేతుర్మహావేగాః పతంగా ఇవ పావకమ్||27||
తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః|
ఆజఘ్నుః వానరశ్రేష్ఠం శరైశ్చాదిత్య సన్నిభైః||28||
ముద్గరైః పట్తిసైః శూలైః ప్రాసతోమరశక్తిభిః|
పరివార్య హనూమంతం సహసా తస్థురగ్రతః||29||

స|| తే తోరణస్థం అవస్థితం కపీంద్రం సమాసాద్య మహావేగాఘ్ పతంగాః పావకం ఇవ అభిపేతుః||తే విచిత్రాభిః గదాభిః పరిఘైః కాంచనాంగదైః శరైః ఆదిత్యసన్నిభైః వానరశ్రేష్ఠం ఆజఘ్నుః చ || ముద్గరైః పట్టి శూలైః ప్రాసతోమరశక్తిభిః సహసా హనూమంతం పరివార్య (తస్య) అగ్రతః తస్థుః||

వారు అశోకవన తోరణము పై ఆసీనుడైన కపీంద్రుని సమీపించి, ప్రజ్వరిల్లు తున్న అగ్నిలోకి దూకిన కీటకుములవలే, హనుమంతునిపై దూకిరి. వారు విచిత్రమైన గదలతో పరిఘలతో బంగారు గదలతో సూర్యునికిరణములవలె తేజరిల్లు తున్న శరములతో వానరశేష్ఠునిపై దాడిచేసిరి. ముద్గరములు పట్టిశములు శూలములు పట్టుకొని వేగముగా హనుమంతుని చుట్టుముట్టిరి.

హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వతసన్నిభః|
క్షితవావిధ్య లాంగూలం ననాద చ మహాస్వనమ్||30||
స భూత్వా సుమహాకాయో హనుమాన్మారుతాత్మజః|
ధృష్ట మాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్||31||
తస్యాస్ఫోటితశబ్దేన మహతా సానునాదినా|
పేతుర్విహంగా గగనాదుచ్చైశ్చేద మఘోషయత్ ||32||

స|| తేజస్వీ పర్వతసన్నిభః హనుమాన్ అపి లాంగూలం క్షితౌ ఆవిధ్య మహాస్వనం ననాద|| మారుతాత్మజః సః హనుమాన్ సుమహాకాయః భూత్వా శబ్దేన లంకాం పూరయన్ ధృష్టం అస్ఫోటయామాస|| తస్య మహతా సానునాదినా ఆస్ఫోటితశబ్దేన విహంగాః గగనాత్ పేతుః | ఉచ్చైః ఇదం అఘోషయత్ ||

తేజస్వి పర్వతాకారరూపము గల హనుమంతుడు తన తోక ఝాడించి మహత్తరమైన నాదము చేసెను. మారుతాత్మజుడు అయిన ఆ హనుమంతుడు తన కాయమును పెరిగించి లంకానగరము అంతా శబ్దముతో నిండునట్లు జబ్బలు చరిచెను. ఆ మహత్తరమైన నాదముతో పలికిన శబ్దములతో ఆకాశమునుండి పక్షులు నేలకు రాలినవి. హనుమంతుడు గట్టిగా ఇట్లు ఘోషించెను.

జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః|
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః||33||
దాసోsహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతామారుతాత్మజః||34||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||35||
అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||36||

స|| అతి బలః రామః జయతి | మహాబలః లక్ష్మణః చ (జయతి) |రామేణ అభిలాషితః రాజా సుగ్రీవః చ జయతి||శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః హనుమాన్ అహం క్లిష్టకర్మణః రామస్య కోసలేంద్రస్య దాసః ||సహస్రశః శిలాభిః పాదపైశ్చ ప్రహరతః మే యుద్ధే రావణ సహస్రం ప్రతిబలం న భవేత్ ||సర్వరక్షసాం మిషతాం లంకాం పురీం అర్దయిత్వా మైధిలీం అభివాద్య చ సమృద్ధార్థః గమిష్యామి||

'అతిబలవంతుడైన రామునికి జయము. మహాబలుడైన లక్ష్మణునికి జయము. రామునిచేత పరిపాలింపబడిన సుగ్రీవునకు జయము. శత్రుసైన్యములను వధించగల మారుతాత్మజుడను నేను క్లిష్టటమైన కర్మలను సాధించ గల రాముని దాసుడను. వేలకొలది శిలలతో వృక్షములతో తిరుగుతూ వున్న నన్ను యుద్ధములో వేయి మంది రావణులు కూడా ఎదిరించలేరు. రాక్షసులందరూ చూస్తూ ఉండగానే లంకను ధ్వంశము చేసి మైథిలికి అభివాదము చేసి కృతకృత్యుడనై వెళ్ళెదను'

తస్య సన్నాదశబ్దేన తేఽభవన్భయశంకితాః|
దదృశుశ్చ హనూమంతం సంధ్యామేఘ మివోన్నతమ్ ||37||
స్వామి సందేశనిశ్సంకాః తతస్తే రాక్షసాః కపిమ్|
చిత్రైః ప్రహరణైర్భీమైః అభిపేతుస్తతస్తః||38||
స తై పరివృతః శూరైః సర్వతః సుమహబలః |
అససాదాsయసం భీమం పరిఘం తోరణాశ్రితమ్||39||

స|| తే తస్య సన్నాదశబ్దేన భయశంకితాః అభవన్| సంధ్యామేఘం ఇవ ఉన్నతం హనూమంతం దదృశుః చ ||తతః తే రాక్షసాః స్వామిసందేశ నిఃశంకాః చిత్రైః ప్రహరణైః కపిం అభిపేతుః||సుమహాబలః సః తైః శూరైః సర్వతః పరివృతః తోరణాశ్రితం భీమం ఆయసం పరిఘం అససాద||

వారందరూ అతని చే చేయబడిన నాదముతో భయపడినవారైరి. సంధ్యాకాల మేఘమువలె ఉన్నతమైన ఆకారము చూచిరి. అప్పుడు ఆ రాక్షసులు ప్రభువు ఆదేశానుసారము చిత్ర విచిత్రములైన ఆయుధములతో కపి పై దాడి చేసిరి. ఆ మహాబలుడు ఆ శూరులచే అన్నివేపుల చుట్టుముట్టబడి తోరణముపై ఉన్న భయంకరమైన పరిగెను తీసుకొనెను.

స తం పరిఘమాదాయ జఘాన రజనీచరాన్|
స పన్నగమివాదాయ స్ఫురంతం వినతాసుతః||40||
విచచా రాంబరే వీరః పరిగృహ్య చ మారుతిః|
స హత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్మారుతాత్మజః||41||
యుద్ధకాంక్షీ పునర్వీరః తోరణం సముపాశ్రితః|

స|| సః తం పరిహం ఆదాయా రజనీచరాణ్ జఘాన | వీరః సః మారుతిః వినతాసుతః స్ఫురంతం పన్నగాం ఆదాయ పరిగృహ్య అంబరే విచచార|| వీరః సః మారుతాత్మజః వీరాన్ కింకరాన్ రాక్షసాన్ హత్వా యుద్ధకాంక్షీ తోరణం సముపాశ్రితః||

అతడు ఆ పరిఘను తీసుకొని నిశాచరులను కొట్టెను. వీరుడు ఆ మారుతి గరుత్మంతుడు మహాసర్పమును పట్టుకొని అకాశములో తిరిగినట్లు ఆపరిఘను తీసుకొని తిరిగెను. వీరుడైన ఆ మారుతాత్మజుడు కింకరులు అనబడు రాక్షసులను హతమార్చి యుద్ధము చేయుటకు కోరిక గలవాడై మరల అ తోరణము ఆశ్రయించెను.

తతః తస్మాద్భయాన్ముక్తాః కతిచిత్తత్ర రాక్షసాః||42||
నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ న్యవేదయన్||43||

స|| తతః తత్ర తస్మాత్ భయాత్ ముక్తాః కతిచిత్ రాక్షసాః సర్వాన్ కింకరాన్ నిహతాన్ (ఇతి) రావణాయ న్యవేదయన్||

అప్పుడు అక్కడ అయనపై భయపడి పరిపోయిన కొందరు రాక్షసులు 'కింకరులు అందరూ హతమార్చబడిర" అని రావణుని కి నివేదించిరి.

స రాక్షసానాం నిహతం మహద్బలం నిశమ్య రాజా పరివృత్త లోచనః|
సమాదిదేశాప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయమ్||44||

స||సః రాజా రాక్షసానాం మహత్ బలం నిహతం నిశమ్య పరివృతలోచనః పరాక్రమే అప్రతిమం సమరే సుదుర్జయం ప్రహస్త పుత్రం సమాదిదేశ||

ఆ రాజు రాక్షసులయొక్క మహత్తరమైన బలగము హతమార్చబడినట్లు విని , కళ్ళు తిప్పుతూ అప్రతిమమైన పరాక్రమము గల జయింపబడలేని ప్రహస్తుని పుత్రునికి ఆదేశమిచ్చెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ద్విచత్వారింశస్సర్గః ||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభైరెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||